మార్కాపురం టిడిపి టిక్కెట్ కందులదే – పరిశీలకులు బిసి జనార్ధన్ రెడ్డి
పొదిలి పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు బిసి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ కందుల నారాయణరెడ్డి దే అని పార్టీ కార్యకర్తలు ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోకుండా నారాయణ రెడ్డి విజయానికి పాటుపడాలని అన్నారు.
పార్టీ అండదండలు నారాయణరెడ్డి కి పుష్కలంగా ఉన్నాయని ఇటివల చంద్రబాబుతో కందుల భేటీ సందర్భంగా బాగా కష్టపడుతున్నావు మరింతగా కష్ట పడాలని సూచించి టికెట్ ఖరారు చేసినట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు , మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ , తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి యస్ ఎం భాషా, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి పొల్లా నరసింహ యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ,
తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ భాష, మండల,పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్ మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా, తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, తెలుగు దేశం పార్టీ నాయకులు ఓబయ్య యాదవ్,కోటప్ప నాయుడు, కాటూరి శ్రీను జ్యోతి మల్లి నరసింహారావు, మమిళ్లపల్లి వెంకటేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు పోపురి నరేష్, తదితరులు పాల్గొన్నారు