పొదిలి కి మాజీ హోం మంత్రి జానారెడ్డి రాక
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి పొదిలి పట్టణంలో పర్యటించారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి నివాస గృహానికి వెళ్లి అక్కడి నుంచి ఉడుముల హాస్పిటల్ ను సందర్శించారు.
అనంతరం జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు కుందూరు పెద్ద కొండారెడ్డి పరామర్శించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో తన తోటి సహచర మాజీ శాసనసభ్యులు ముక్కు కాశీ రెడ్డి ఉడుముల శ్రీనివాసులురెడ్డి కలిసి వెళ్లే భాగంలో పొదిలి కి వచ్చునని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాకు అన్న సీనియర్ ఎవరు లేరని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రెండు మూడు నెలలు జూనియర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ముక్కు కాశీ రెడ్డి,ఉడుముల శ్రీనివాసులురెడ్డి, కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు