జెయన్ఆర్ కంపెనీ ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించిన ఎంఎల్ఏ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణం లో జగనన్న లేఔట్ నందు జెయన్ఆర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్న లబ్దిదారుల ఇంటి నిర్మాణం పనులను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా శంఖుస్థాపన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకా వెంకట్ రెడ్డి, సాయి రాజేశ్వరరావు, పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ హనిమూన్ శ్రీనివాసులురెడ్డి షేక్ నూర్జహాన్ కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు