అంబేద్కర్ కు ఘన నివాళి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మంగళవారం నాడు స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సండ్రపాటి కాలేబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబెడ్కర్ చిత్ర పటానికి ప్రభుత్వ వైద్యులు చక్రవర్తి యస్ఐ శ్రీహరి లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వైద్యశాల నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.


ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు