రామచంద్ర యాదవ్ ఇంటి పై దాడి చర్యలు తీసుకోవాలి తెలుగు దేశం పార్టీ వినతి

ప్రముఖ పారిశ్రామికవేత్త బిసి నాయకులు రామచంద్ర యాదవ్ ఇంటి పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మూడు వందల మంది అల్లరి మూకలు బీభత్సం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి కి పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు మంగళవారం నాడు వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని తక్షణమే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో అటవీక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి నారాయణ బాబు, కాటూరి నారాయణ ప్రతాప్, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,పొల్లా నరసింహ యాదవ్,స్వర్ణ గీత, సమంతపూడి నాగేశ్వరరావు,మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్, కనకం వెంకట్రావు యాదవ్, కాటూరి శ్రీను,ఓబయ్య యాదవ్, ముని శ్రీనివాస్,సన్నెబోయిన సుబ్బారావు, బోడ్డు సుబ్బయ్య, షేక్ గౌస్ భాష, షేక్ మహమ్మద్, షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు