బీమా మేళాకు విశేష స్పందన

భారత తంతి తపాలా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు పొదిలి పట్టణంలో ఏర్పాటు చేసిన భీమా మేళాకు విశేష స్పందన లభించింది.

పొదిలి పట్టణంలోని చర్చి సెంటర్ ,పెద్ద బస్టాండ్ ,చిన్న బస్టాండ్, లారీ యూనియన్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు వద్ద భవన నిర్మాణ కార్మికులు మోటార్ వాహన కార్మికులు మరియు వివిధ రంగాలలోని కార్మికులు పెద్ద ఎత్తున భీమా పాలసీలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 399 రూపాయలకే 10 లక్షల ప్రమాద భీమా కార్యక్రమం తపాల శాఖ ఆధ్వర్యంలో ప్రతి తపాలా శాఖ కార్యాలయంలో నందు నిరంతరం జరుగుతుందని కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు