స్మశానం లో అక్రమ కట్టడాలు కూల్చివేత .. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన కందుల
పొదిలి పట్టణంలోని శివాలయం దేవస్థానం ఎదురుగా ఉన్న స్మశానం నందు అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయాలను కూల్చివేసారు.
శుక్రవారం నాడు మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్,పొదిలి సిఐ సుధాకర్ రావు ఆధ్వర్యంలో స్థానిక శివాలయం దేవస్థానం ఎదురుగా పొదిలి గ్రామ సర్వే నెంబర్ 853/2 లోని స్మశానం నందు అక్రమంగా నిర్మించిన వాణిజ్య సముదాయాలను కూల్చివేసారు.
ఈ సందర్భంగా మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 2010 సంవత్సరంలో స్మశానం నందు అక్రమంగా వాణిజ్య సముదాయాలను నిర్మాణం చేసారని మందగిరి వెంకటేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోకయుక్త ఫిర్యాదు చేసారని సదరు లోకాయుక్త ఆక్రమ కట్టడాలు తొలగించాలని ఆదేశించాగా మండల రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయగా నోటీసు మీద హైకోర్టు ను ఆశ్రయించగా స్టే రాగా తదుపరి జాయింట్ కలెక్టర్ కోర్టు నందు కూడా అక్రమంగా నిర్మించిన కట్టడాలు తొలగించాలని ఉత్తర్వులు జారీ చేయగా సదరు ఉత్తర్వులు పై మరాల హైకోర్టు ను ఆశ్రయించగా హైకోర్టు సిసియల్ఎ కు కేసు బదిలీ చేయ్యగా సిసియల్ఎ సుదీర్ఘ విచారణ అనంతరం గత నవంబర్ 10వ తేదీన తుది విచారణ జరిపి ఉత్తర్వులను డిసెంబర్ 7వ తేదీన పంపగా సదరు ఉత్తర్వులు మేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమీషన్ కు ఆదేశాలు జారీ చేసామని మున్సిపల్ కమిషనర్ వారు కోరిన మీదట పంచనామా నిర్వహించగా మున్సిపల్ సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగించారని తెలిపారు.
స్మశానం నందు అక్రమ నిర్మాణాలను తొలగించే సమయం అడ్డుకునేందుకు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు
తెలుగు దేశం పార్టీ శ్రేణులు రెండు గంటల పాటు అక్కడే ఉండి అడ్డుకునేందుకు శక్తియుక్తుల ప్రయత్నించినా పోలీసులు తిప్పి కొట్టారు.
ఎట్టకేలకు హైడ్రామా మధ్య అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు.
ఈ తొలగింపు కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పొదిలి సిఐ సుధాకర్ ఆధ్వర్యంలో బారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.