ఈత పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించిన పొదిలి యువకుడు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలంగాణ మాస్టర్స్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఈత పోటీల చాంపియన్ షిప్ -2022 పోటీలు ఆదివారం నాడు హైదరాబాద్ లోని కూకట్ పల్లి రాహుల్ అకాడమీ నందు జరిగాయి.
ఈ పోటీల్లో పొదిలి మండలం గోగినేని వారి పాలెం చెందిన గోపనబోయిన శ్రీనివాస్ 100 మీటర్ల లో రెండు విభాగాల్లో 50 మీటర్ల లో రెండు విభాగాల్లో పాల్గొని ప్రథమ స్థానం సాధించారు.
అనంతరం తెలంగాణ మాస్టర్స్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాహుల్, కోశాధికారి సంజయ్ సింగ్, కార్యనిర్వహక కార్యదర్శి క్విన్ విక్టోరియా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి నారాయణ రెడ్డి చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లును అందుకున్నట్లు గోపనబోయిన శ్రీనివాస్ పొదిలి టైమ్స్ కు తెలిపారు.
ఈత పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన గోపనబోయిన శ్రీనివాస్ ను పలువురు ప్రముఖులు అభినందించారు