ఆక్రమణలు తొలగింపును అడ్డుకున్న స్థానికులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని చిన్న బస్టాండ్ సెంటర్లో మురుగు కాల్వ ఆక్రమణ తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నం చేయడంతో మున్సిపల్ సిబ్బందిని స్థానికులు అడ్డుకొని పూర్తి స్థాయిలో సర్వే చేయించి మార్కింగ్ ఇచ్చిన తర్వాతనే తొలగింపులు చెయ్యాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని పరిస్థితిని అదుపులో తిసుకొని వచ్చారు.

పరిస్థితి ఉద్రిక్తత గా మారటంతో మున్సిపల్ సిబ్బంది భూమి చదును చేసి వెనుతిరిగి వెళ్లారు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ప్రవీణ్ మున్సిపల్ సిబ్బంది మరియు పోలీసులు తదితరులు పాల్గొన్నారు