పొదిలి పట్టణంలో కలెక్టర్ విస్తృత పర్యటన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పొదిలి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని జగనన్న లేఔట్ నందు లబ్దిదారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్ని వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

లే ఔట్ నందు ఇంటి నిర్మాణాలకు ప్రదానంగా నీటి సమస్యలను ఎదుర్కొంటున్నమని లబ్ధిదారులు తెలిపగా అధికారులు తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు లే ఔట్ నందు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 23 మందికి ఉచితం విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అదే విధంగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి అయిన ప్రతి ఒక్క ఇంటికి ఉచితంగా విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.

అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నాడు నేడు పేరుతో నిర్వహించిన పాఠశాల భవనాలను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో కనిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి సందీప్ కుమార్, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ పవన్ కుమార్, మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు