మల్లవరం గ్రామంలో పొలంబడి కార్యక్రమం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలంలోని మల్లవరం గ్రామం నందు మండల పొలంబడి కార్యక్రమం శనివారం నాడు జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులుద్దీన్ మాట్లాడుతూ కందిలో వెర్రి తెగులు ఎక్కువగా గమనించడం జరిగింది దీనికిగాను LRG-52,ICPL-87119 రకాలను సాగు చేసుకోవాలని కందిలో ఎండు తెగులు రాకుండా ముందుగా ఒక కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలని అలా చేసినట్లయితే కొంతవరకు ఎండు తెగులు నివారించుకోవచ్చు అన్నారు.
కందిని ఏక పంటగా కాకుండా వివిధ పంటలను సాగు చేసుకోవాలని అలా చేసినట్లయితే పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు అని పైరు విత్తిన 90-100 రోజులప్పుడు చిగుళ్ళను ఒక అడుగు మేరకు కత్తిరించాలని ఎకరాకు నాలుగు లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 20 పక్షిస్తావరాలు ఏర్పాటు చేయాలన్నారు.
పురుగు తొలి దశలో లార్వాలను నివారించుటకు వేప నూనె స్ప్రే చేయాలన్నారు పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో పురుగు తట్టుకునే రకాలు ICPL-332,LRG -41 రకాలను సాగు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు యర్రముడి వెంకటేశ్వర యాదవ్, గ్రామ సర్పంచ్ రెడ్డిబోయిన సుబ్బయ్య యాదవ్,మండల వ్యవసాయ అధికారులు మరియు గ్రామ సహాయకులు గ్రామంలోని రైతులు పాల్గొన్నారు.