యాదవ మహాసభ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు గా యేటి నియామకం
అఖిల భారత యాదవ మహాసభ మార్కాపురం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు గా యేటి ఏడుకొండలు ను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బోట్ల రామారావు యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆదివారం నాడు పొదిలి మండల పర్యటనలో భాగంగా పాల్గొన్నా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బోట్ల రామారావు మార్కాపురం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు గా పొదిలి మండలానికి చెందిన యేటి ఏడుకొండలు ను నియమించి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్,మూరబోయిన బాబురావు యాదవ్, మస్తాన్ రావు యాదవ్ చిరుమల్లే శ్రీనివాస్ యాదవ్, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు