ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శాసనమండలి సభ్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

సోమవారం నాడు స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ సెంటర్లో టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్ జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ భాష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్ లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వైద్యులు ఆనంద్, తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, కాటూరి నారాయణ ప్రతాప్, ముల్లా ఖూద్దుస్, జ్యోతి మల్లి, బాదం రవి, నరసింహారావు, కాటూరి శ్రీను, బోడ్డు సుబ్బయ్య, షేక్ మహమ్మద్, షేక్ షన్వాజ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు