ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

గురువారం నాడు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పొదిలి పోలీస్ స్టేషన్ నందు సర్కిల్ ఇన్స్పెక్టర్ యు సుధాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల రెవెన్యూ తహశీల్దారు ప్రాంగణంలో తహశీల్దారు భాగ్యలక్ష్మి, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ప్రాంగణంలో ఎంపిడిఓ శ్రీకృష్ణ, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ డానియల్ జోసప్, యస్ఈబి కార్యక్రమంలో సిఐ ఖాజా మొహిద్దిన్, ప్రభుత్వం వైద్యుశాల నందు డాక్టర్ ఆనంద్, రోడ్లు మరియు భవనాలు శాఖ కార్యాలయం నందు డిఈ , వ్యవసాయ శాఖ కార్యాలయంలో నందు వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ వివిధ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు నందు జాతీయ జెండాలను ఎగురవేశారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిందన్ని మహిళలకు సమాన అవకాశాలు వచ్చాయని ప్రస్తుత సమాజంలో యువత స్వాతంత్ర ఫలితాలను సద్వినియోగం చేసుకోవాలని మంచి మార్గంలో పయనించాలని అన్నారు