మే నెలలో అఖిలేష్ యాదవ్ తో భారీ బహిరంగ సభ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

అఖిల భారత యాదవ మహాసభ అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మే నెలలో నిర్వహించే యాదవ మేళా భారీ బహిరంగసభ కు సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకానున్నారని యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు మందగిరి వెంకటేష్ యాదవ్ అన్నారు.

ఆదివారం నాడు స్థానిక పొదిలి పట్టణ దరిశి రోడ్ మంజునాథ కళ్యాణ మంటపం నందు జరిగిన నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు యేటి ఏడుకొండలు అద్యక్షతన జరిగిన అఖిల భారత యాదవ మహాసభ మార్కాపురం నియోజకవర్గం సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన యేటి ఏడుకొండలు మాట్లాడుతూ శతాబ్ద ఉత్సవాలు భాగం గ్రామ స్థాయి నుంచి అఖిల భారత యాదవ మహాసభ గ్రామ అభ్యుదయ సమితిలు ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్క యాదవ మహాసభ కార్యకర్త కృషి చేసి మే నెలలో జరిగే యాదవ మేళాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం అఖిల భారత యాదవ మహాసభ మండల అధ్యక్షులు వీర్ల శ్రీనివాస్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షులు పొల్లా నరసింహ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ వీర్ల శ్రీనివాస్ యాదవ్, నారబోయిన భిక్షాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.