విభిన్న ప్రతిభావంతుల ఆద్వర్యంలో అన్నదానం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
విభిన్న ప్రతిభవంతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
వివరాలు లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి గ్రామపంచాయతీ కార్యాల వద్ద విభిన్న ప్రతిభావంత సంఘం నాయకులు బత్తిన నరసింహారావు యాదవ్, ఆంజనేయులు ఆధ్వర్యంలో నగర పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు చెప్పిటిన అన్నదానం కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రమణా రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నరసింహారావు నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు సర్పంచ్ చిరుమల్లె శ్రీనివాస్ యాదవ్ పట్టణ మండల పార్టీ అధ్యక్షులు షేక్ నూర్జహాన్, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.