వాటర్ షెడ్ చీకటి కమిటీల ఫిర్యాదు చేసిన బిజెపి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండలం తువ్వపాడు మెగా వాటర్ షెడ్ చీకటి కమిటీలను రద్ధు చెయ్యాలని కోరుతూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీను రెడ్డి కి భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం వినతిపత్రాన్ని అందజేశారు.
భారతీయ జనతా యువ మోర్చా నాయకులు గుండారపు ఈశ్వర్,కళ్లం సుబ్బారెడ్డి,భరత్ రెడ్డి,చెరుకురి శ్రీనివాస్,అమర్ నాథ్ రెడ్డి లతో కూడిన భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఒంగోలు లోని డ్వామా కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ కలిసి వినతిపత్రం అందజేసినట్లు మూడు రోజుల్లో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్ల బృందం సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
తువ్వపాడు మెగా వాటర్ షెడ్ పరిధిలోని నాలుగు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు సమావేశాలు నిర్వహించకుండా చీకటి కమిటీలు ఏర్పాటుకు కారణమైన ప్రాజెక్ట్ ఆఫీసర్ పైన చర్యలు తీసుకోని తిరిగి గ్రామ సభలు నిర్వహించి వాటర్ షెడ్ కమిటీలను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.
సరైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు