ఎంఎల్ఏసీ అభ్యర్థి విజయానికి విస్తృత ప్రచారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయానికి కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో వద్దిమడుగు,వాగుమడుగు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు

ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గ్రామ, బూత్ కమిటీ సభ్యులు సమావేశంలో నిర్వహించి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు విశిష్టత గురించి వివరించారు.

 

ఈ కార్యక్రమంలో కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కనకం నరసింహారావు, చప్పిడి రామ లింగయ్య, దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు