జగనాసుర రక్త చరిత్ర పుస్తకం ఆవిష్కరణ
జగనాసుర రక్త చరిత్ర పుస్తకాన్ని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్చ్ ఆవిష్కరించారు
బుధవారం నాడు స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారని ప్రజల సానుభూతి కోసం ఆభూతకల్పనలు కల్పించి తన సొంత మానస పుత్రిక అయిన ” సాక్షి’ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని బ్యానర్ హెడ్డింగులు వ్రాయించి సొంత ఛానల్లో పదేపదే అదే వార్తలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయంగా లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య విషయం లో గొడ్డలి పోటును సైతం గుండెపోటుగా చిత్రీకరించి మసి పూసి మారేడు కాయ చేశారని తెలుగుదేశం పార్టీ మీద అబాండాలు వేసి రాజకీయ లబ్ధి పొందారని ఇప్పుడు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియా సపోర్టు ఉందని నేనొక్కడినే పోరాటం చేయవలసి వస్తుందని చెబుతున్నారు అని ప్రజలు నమ్మవద్దని ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు.
ఈ సమావేశంలో తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి యస్ ఎం భాషా, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పండు అనిల్, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ భాష, జిల్లా వాణిజ్య విభాగం జిల్లా మాజీ అధ్యక్షులు సమంతపూడి నాగేశ్వరరావు, మండల,పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్ , మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామ లింగయ్య, తెలుగు దేశం పార్టీ నాయకులు సన్నేబోయిన సుబ్బారావు యాదవ్, కాటూరి శ్రీను, జ్యోతి మల్లి , మురళి,యాసిన్ ఆవూలూరి కొటప్ప నాయుడు చలగాలి రామయ్య తదితరులు పాల్గొన్నారు.