బచ్చల అర్జునుడు మృతి సంతాపం తెలిపిన నూకసాని

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

శాసనమండలి సభ్యులు గన్నవరం తెలుగు దేశం పార్టీ ఇంన్చర్జ్ బచ్చుల అర్జునుడు మృతికి తెలుగు దేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

గురువారం నాడు పొదిలి పట్టణానికి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు స్థానిక కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ షాప్ లో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ ఛైర్మన్, శాసనమండలి సభ్యులుగా తెలుగు దేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పనిచేసరని బచ్చల అర్జునుడు మృతి బడగు బలహీన వర్గాలకు తీవ్ర లోటు అని వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాలేషా, కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్, యాదవ మహాసభ నాయకులు యేటి ఏడుకొండలు, కనకం వెంకట్రావు యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, సన్నేబోయిన రాంబాబు, చాగంటి వెంకటేశ్వర్లు, కోగర నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.