టిడిపి అభ్యర్థి కరపత్రం ఆవిష్కరణ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ప్రచార కరపత్రాన్ని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆవిష్కరించారు.
శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణం లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కంచర్ల శ్రీకాంత్ చౌదరి ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు విచక్షణతో ఆలోచన చేసి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి విధంగా ఘన విజయం సాధించేందుకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పట్టణ తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు