అటెండర్ కోటేశ్వరరావు కు సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు పని చేసి పదవీ విరమణ చేసిన అటెండర్ కోటేశ్వరరావు ను మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ ఘనంగా సత్కరించారు.
గురువారం నాడు స్థానిక నగర పంచాయితీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటెండర్ కె కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఇంజినీర్ రవిచంద్రుడు , పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ మరియు నగర పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు