ముగ్గురు ముద్దాయిలు కు మూడు నెలలు జైలు శిక్ష

పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులో ముగ్గురు ముద్దాయిలు అరెస్టు చేసి శుక్రవారం నాడు ఫస్ట్ క్లాస్  జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు యస్ఐ మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు.

పొదిలి పట్టణంలోని తూర్పు పాలెం నందు గల ఇంటిలో రూ 30,000/- విలువైన కాష్, బంగారు మరియు వెండి వస్తువులు మరియు పొదిలి మార్కాపురం క్రాస్ రోడ్ సమీపంలో లోని సిమెంట్ బ్రిక్ ఫ్యాక్టరీ నందు రూ 24,000/- విలువైన కేబుల్ వైర్ మరియు అచ్చిరెడ్డి నగర్ నందు రూ 50,000/- విలువైన స్కూటీ లను ముద్దాయిలు దొంగిలించడం పై పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన  శీలం తిరుపతయ్య ,సవరం నీలయ్య ,కోమరగిరి లీలయ్య  అనువారి పైన పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 73/2022 U/s 457, 380 IPC, క్రైమ్ నెంబర్ 309/2022 U/s 457, 380 IPC మరియు క్రైమ్ నెంబర్ 310/2022 U/s 379 or 411 IPC కేసులు కాగా వారిని శుక్రవారం నాడు పొదిలి పోలీస్ వారు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా వారు నేరం అంగీకరించటం మూడు నెలల జైలుశిక్ష విధించినట్లు యస్ఐ మల్లిఖార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు