వైసిపి ఎంఎల్ఏసీ అభ్యర్థులను గెలిపించండి – మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఎంఎల్ఏసీ ఎన్నికల విజయం ముఖ్యమంత్రి ప్రతిష్టకు సంబంధించిన అంశం

ఎన్నికల్లో విజయం సాధించకపోతే ప్రభుత్వం పని అయిపోయింది అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం

తప్పని సరిగా ఎంఎల్ఏసీ ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పని చెయ్యాలి

ఎంఎల్ఏసీ ఎన్నికల విజయం 2024 ఎన్నికల పై ఉంటుంది

ప్రైవేటు విద్యా సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు

పొదిలి పట్టణంలో శుక్రవారం నాడు జరిగిన ప్రైవేటు విద్యా సంస్థల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని మంజునాథ కళ్యాణ మంటపం నందు కెవి రమణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రైవేటు విద్యా సంస్థ యాజమాన్య ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు, టీచర్లు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి సారిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు పార్టీ తప్పని సరిఅని ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టకు సంబంధించిన అంశమని మనం గెలుపు సాధించాక పోతే ప్రభుత్వం పని అయిపోయింది అంటూ ప్రతి పక్షాలు ప్రచారం చేసే అవకాశం ఉందని 2024 సాధారణ ఎన్నికల పై ప్రభావం చూపుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శ్యాంప్రసాద్ రెడ్డి టీచర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి లవిజయానికి కృషి చెయ్యాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంకె వెంకటరెడ్డి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి మొగల్ కాలేషా బేగ్, వెన్నా హనుమా రెడ్డి, వై వెంకటేశ్వరరావు గుండారెడ్డి నరాల ఈశ్వర్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు