డ్రగ్స్ అవగాహన సంకల్ప సదస్సు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

నేటి యువత డ్రగ్స్‌ బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పొదిలి యస్ఐ మల్లిఖార్జునరావు విద్యార్థులకు సూచించారు. పొదిలి పట్టణంలోని ‌విరిశెట్టి , వివేకానంద జూనియర్ కళాశాలల్లో శనివారం నాడు యాంటీ డ్రగ్‌ పై అవగాహన గురించి సంకల్పం కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి యువత డ్రగ్స్‌ బారినపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటిని వాడడం వల్ల నష్టాలతో పాటు విద్యార్థుల భవిష్యత్తును పాడి చేసుకున్నారన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల రవాణాలో యువతను ప్రలోభ పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నారని వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అటువంటివారు ఎవరైనా తారసపడితే తమకు సమాచారం అందించారన్నారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు