విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పట్టణంలోని ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు భారత వినియోగదారుల రక్షణ చట్టం మరియు హక్కుల పరిరక్షణ గురించి వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
మార్చి 15వ తేదీ ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నాడు విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తామని నిర్వహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి రామారావు, జి బి షా, ఎం నరసింహారావు యల్లమందారెడ్డి, షేక్ షఫీ, బి అపర్ణ, హాఫిషా మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు