భారత యువ దౌత్యవేత్త పొదిలి యువకుడు ఇస్మాయిల్ కు ఉత్తమ పురస్కారం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

వియత్నాం దేశం లో హనోయి నగరం నందు మార్చి 11 నుంచి 14 వరకు జరిగిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మోడల్ సమావేశంలో భారత తరపున పాల్గొన్న పొదిలి చెందిన యువ దౌత్యవేత్త ఇస్మాయిల్ ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్నారు.

బారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు దేవాలయాలు గురించి సమగ్రంగా విశ్లేషణ చేసి అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తి ప్రతిష్టలను పెంపొందించిన మన పొదిలి చెందిన షేక్ ఇస్మాయిల్ ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు.