కెసిఆర్ కప్ విజేతకు సత్కారం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
బాలికల ఉన్నత పాఠశాల నందు రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ రవి మాస్టర్ వేణు ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే శిక్షణ గురించి అవగాహన కల్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన కారేటే పోటిల కేసీఆర్ కప్ ను పొదిలి విద్యార్థులు గెలుచుకున్నట్లు అందుకు కారకులైన మాస్టర్ వేణు ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు