పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సిఐ కృష్ణం వీరా రాఘవేంద్ర

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఏప్రిల్ నెల 3 వ తేదీ నుంచి 18 వరకు జరుగనున్నా పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సిఐ కృష్ణం వీరా రాఘవేంద్ర తెలిపారు.

ఆదివారం నాడు స్థానిక పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ కృష్ణం వీరా రాఘవేంద్ర మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుంది, ఎగ్జామ్స్ సెంటర్ల దగ్గర్లో జిరాక్స్‌ షాప్స్ మూసి వేయాలని కోరారు.

పరీక్షా కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఏ ఇతర సిబ్బంది గానీ వ్యక్తులు గానీ ఉండరాదని మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు మరియు ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద ఎవరైనా కాపీలు అందించడానికి పాల్పడితే అట్టి వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ విలేకర్ల సమావేశంలో పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు కొనకనమిట్ల యస్ఐ దీప తాడివారిపల్లి యస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు