యాదవ అన్నదాన సత్రం వ్యవస్థాపకులు బిక్షాలు మృతి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పృదలగిరి యాదవ అన్నదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు నారబోయిన బిక్షాలు (68) మృతి చెందారు.

గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం నాడు తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

గత నలభై ఏళ్లుగా అఖిల భారత యాదవ మహాసభ నాయకుడు గా పృదలగిరి యాదవ అన్నదాన సత్రం నిర్వాహకులు గా పనిచేసినా నారబోయిన బిక్షాలకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు.

అఖిల భారత యాదవ మహాసభ నాయకులు నారబోయిన బిక్షాలు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు.

గురువారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబం సభ్యులు తెలిపారు.edited 07:19 PM