తహశీల్దారు కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు చలివేంద్రం ఏర్పాటు చేశారు.
బుధవారం నాడు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కిలారి సుబ్బారావు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన చలివేంద్రన్ని మండల రెవెన్యూ తహశీల్దారు భాగ్యలక్ష్మి లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా తహశీల్దారు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్ఐ కిలారి సుబ్బారావు తన సొంత నిధులతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ షేక్ సాజిదా, ఆర్ఐ కిలారి సుబ్బారావు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు .edited 07:18 PM