మంచినీటి సరఫరా కై మహిళలు రాస్తారోకో
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మంచినీటి సరఫరా చెయ్యాలని కోరుతూ బాప్టిస్ట్ పాలెం వద్ద ఒంగోలు – కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం నాడు మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
గత పది రోజులుగా మంచి నీటి సరఫరా లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు.
రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులుతో నచ్చజెప్పి రాస్తారోకో విరమించారు.
రాస్తారోకో తో కిలోమీటర్ల నిలిచిన వాహనాలను పోలీసులు క్రమబద్దీకరణ చేసారు