పుల్లగోర్ల ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి నగర పంచాయితీ 14 వార్డు నందు మాజీ సర్పంచ్ సచివాలయం కన్వీనర్ పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.

మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆదేశాల మేరకు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం బుధవారం నాడు నగర పంచాయితీ 14వ వార్డు పోతవరం యస్సీ కాలనీ నందు ఇంటి ఇంటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించారు.

ఈ కార్యక్రమంలో గృహ సారథులు జి ఏసోబు, చిన్న, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వార్డు నాయకులు అంకయ్య, నరసింహాం, జి సుబ్బయ్య, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు