సచివాలయం కు రక్షిత మంచినీటి యంత్రం పంపిణీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

వేసవి కాలంలో సచివాలయంకు వచ్చే ప్రజలకు వేసవి తాపం ఉపశమనం కోసం మూగచింతల గ్రామానికి చెందిన అంబటి శ్రీనివాసులు రెడ్డి 10 వేలు విలువ చేసే రక్షిత మంచినీటి యంత్రాన్ని కొండాయిపాలెం సచివాలయంకు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో మూగచింతల పంచాయతీ కార్యదర్శి సిహెచ్ రాజేష్,కొండాయపాలెం పంచాయతీ కార్యదర్శి జి గురవయ్య ,డిజిటల్ అసిస్టెంట్ షేక్ బడేసా సర్వే అసిస్టెంట్ షేక్ మాలిక్, ఇంజనీర్ అసిస్టెంట్ సుధారాణి,అగ్రికల్చర్ అసిస్టెంట్ గురుబ్రహ్మం మరియు వాలంటీర్స్ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.