మర్రిపూడి, గుండ్లసముద్రం చెరువులు రిజర్వాయర్ గా మార్పుకు ప్రభుత్వం ఉత్తర్వులు
పొదిలి చిన్న చెరువు నుంచి గుండ్లసముద్రం మర్రిపూడి చెరువులకు పైప్ లైన్ ద్వారా సాగర్ నీటి సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దరిశి సాగర్ కెనాల్ నుంచి పొదిలి పెద్ద చెరువు, చిన్న చెరువుకు సాగర్ నీటి సరఫరా కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభం నేపథ్యంలో పొదిలి చిన్న చెరువు నుంచి గుండ్లసముద్రం మర్రిపూడి చెరువులకు పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా చేయాలని కోరుతూ మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి ఏప్రిల్ 12వ తేదీ మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేయగా ఏప్రిల్ 28 తేదీన పొదిలి చిన్న చెరువు నుంచి గుండ్లసముద్రం మర్రిపూడి చెరువులకు పైప్ లైన్ ద్వారా సాగర్ నీటి సరఫరా కు అనుమతులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది
ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి మాట్లాడుతూ పొదిలి చిన్న చెరువు నుంచి గుండ్లసముద్రం మర్రిపూడి చెరువులకు పైప్ లైన్ ద్వారా సాగర్ నీటి సరఫరా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అనుమతులు మంజూరు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తు నా తరుపున మర్రిపూడి ప్రజలు తరుఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి లకు ధన్యవాదాలు తెలుపుతూ జీవితాంతం జగన్మోహన్ రెడ్డి కి రుణపడి ఉంటామని ఆయన అన్నారు