తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆక్షర తేజం కార్యక్రమం ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పందరబోయిన సాయికృష్ణ తేజ జయంతి సందర్భంగా తేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్షర తేజం కార్యక్రమాన్ని ప్రారంభించారు
సోమవారం నాడు స్థానిక ఉప్పలపాడు ఉన్నత పాఠశాల నందు వై వెంకట్రావు అద్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఒంగోలు క్రైం సిఐ పందరబోయిన బాలాజీ యాదవ్ మాట్లాడుతూ పిన్న వయసులోనే మృతి చెందిన పందరబోయిన సాయికృష్ణ తేజ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు తేజ ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం శుభపరిణామని భవిష్యత్తులో మరిన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.
తేజ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవిశంకర్, ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో తమ కుమారుడు పందరబోయిన సాయికృష్ణ తేజ జయంతి వేడుకలను జిల్లా పరిషత్ విద్యార్థుల సమక్షంలో నిర్వహించారు
అనంతరం చేతివ్రాత మెళుకువలు సంబంధించిన పుస్తకాల్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారిణి పాకాల ఝాన్సీ రాణి , మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాశం వెంకటేశ్వర్లు, బిసి నాయకులు తాడిబోయిన లక్ష్మీ ప్రసాద్,పులిమి వెంకట రమణారావు, దేవరల రమణయ్య, ఉప్పలపాడు సర్పంచ్ ఏసోబు, యుటియఫ్ నాయకులు పెమ్మని బాల వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు శివరాత్రి శ్రీనివాస్,కొనంకీ సంజీవరావు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు