వైసిపి పార్టీ కార్యాలయం ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దివ్యాంగుల విభాగం కార్యాలయాన్ని మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
శనివారం నాడు స్థానిక పియన్ఆర్ కాలనీ నందు మండల అధ్యక్షులు బత్తిన నరసింహారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి లాంచనంగా ప్రారంభించారు.
అనంతరం దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక పరిపుష్టి అందించేందుకు ఒక యువతికి కంప్యూటర్ ను అందజేశారు
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్, పొదిలి మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి శ్రీనివాసులురెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ బిసి సెల్ అధ్యక్షులు పుల్లగోర్ల శ్రీనివాస్ యాదవ్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి, కొత్తపులి బ్రహ్మ రెడ్డి మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దివ్యాంగుల విభాగం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు