మార్కాపురం టిడిపి అభ్యర్థిత్వం రేసు లో తూమాటి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మార్కాపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రముఖ వ్యాపారవేత్త తూమాటి నరసింహారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గిద్దలూరు మార్కాపురం యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు కేవలం యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గల పార్టీ ఇంన్చర్జ్ లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించాక పోవటంతో పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తూమాటి నరసింహారెడ్డి గత కొంతకాలంగా ఒంగోలు పార్లమెంట్ తెలుగు దేశం పార్టీ అభ్యర్థిత్వం రేసు లో ఉన్నాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మార్కాపురం శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కలిసి సందర్భంలో తూమాటి నరసింహారెడ్డి కి సృష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం
పార్టీ మహానాడు తర్వాత మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థిగా తూమాటి నరసింహారెడ్డి పేరు ప్రకటించే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం