ఉప ఎన్నికల్లో బిజెడి,అప్నాదళ్, ఆప్ విజయం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
దేశ వ్యాప్తంగా జరిగిన మూడు శాసనసభ నియోజకవర్గాలకు మరియు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చెందిన అభ్యర్థులు విజయం సాధించారు.
ఒరిస్సాలోని ఝర్సగూడ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజు జనతాదళ్ అభ్యర్థి దీపలి దాసు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టంకధర్ త్రిపాఠి 49 వేల మెజారిటీ తో ఘన విజయం సాధించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 4 వేల సాధించి డిపాజిట్ కోల్పోయింది.
ఉత్తర ప్రదేశ్ లోని చనేబి శాసనసభ జరిగిన ఉపఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం అప్నా దళ్ అభ్యర్థి రింకు కోల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి కీర్తి కోల్ పై 10 వేల మెజారిటీ గెలవగా శూర్ శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం అప్నా దళ్ అభ్యర్థి అహ్మద్ అన్సారి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అనురాధ చౌహాన్ పై 9 వేల మెజారిటీ గెలుపొందారు.
పంజాబ్ లోని జలంధర్ పార్లమెంట్ కు జరిగిన ఉపఎన్నికల్లో పంజాబ్ లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరంజిత్ కౌర్ చౌదరి పై
55 వేల మెజారిటీ గెలుపొందగా ఇక్కడ శిరోమణి అకాలిదళ్ , బిజెపి పార్టీలు మూడో నాలుగో స్థానాలకు పరిమితమయ్యాయి.