కర్నాటక కాంగ్రెస్ పార్టీ హస్తగతం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కర్నాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది.
మొత్తం 224 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ మార్కు 113 దాటి 136 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
నరేంద్ర మోడీ మానియాను నమ్ముకున్న భారతీయ జనతా పార్టీ ద్వితీయ స్థానంకు పరిమితం కాగా కింగ్ మేకర్ కావలనుకున్న జనతాదళ్ సెక్యులర్ పార్టీకీ తీవ్ర నిరాశతో మూడో స్థానంకు పరిమితం అయ్యింది.
కర్నాటక రాజ్య ప్రగతి పక్ష మొత్తం 25 శాసనసభ ఎన్నికల్లో పోటీ చెయ్యగా పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి గంగవతి నుంచి విజయం సాధించారు
కాంగ్రెసు పార్టీ 136,భారతీయ జనతా పార్టీ 64,జనతాదళ్ సెక్యులర్ 20, కళ్యాణ రాజ్య ప్రగతి పక్షం 01 ,
సర్వోదయ కర్ణాటక పక్షం 01, స్వతంత్రులు 02 విజయం సాధించారు