మంచినీటి దాహార్తికి 7 కోట్ల 26 లక్షలు రూపాయలు మంజూరు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మున్సిపల్ పరిధిలో మంచినీటి దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల 26 లక్షలు రూపాయలు మంజూరు అయ్యాయి.
సోమవారం నాడు స్థానిక పొదిలి సాగర్ పంపు హౌస్ నందు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ మరియు గ్రామీణ నీటి సరఫరా ప్రాజెక్టు అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి పొదిలి మున్సిపల్ పరిధిలో మంచినీటి దాహార్తి తీర్చేందుకు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పొదిలి పట్టణంలోని రాఘవేంద్ర సినిమా థియేటర్ వద్ద కోటి 89లక్షల రూపాయలతో 7 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంక్ ను మరియు మార్కాపురం క్రాస్ రోడ్ సమీపంలోని యఫ్ సి ఐ గూడెం వద్ద 2కోట్ల 26 లక్షల రూపాయలు తో 9 లక్షల లీటర్ల సామర్థ్యం ట్యాంకులను నిర్మాణం చేసేందుకు మరియు ఈ రెండు ట్యాంకుల నుంచి పంపు హౌస్ వరకు కోటి 68 లక్షల రూపాయలతో పైప్ లైన్ నిర్మించేందుకు పాలన అనుమతులు మంజూరు అయ్యాయని వారం రోజుల్లో టెండర్లు కు పిలవనట్లు తెలిపారు
మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రత్యేక కృషి వలన 7 కోట్ల 26 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు మంజూరు అయ్యాయని వచ్చే నెలలో పనులు ప్రారంభం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు
ఈ సమీక్ష సమావేశంలో రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టు యస్ఈ ఎం అలీ , మున్సిపల్ హెల్త్ డిఈ జానీ ఆదాం షఫి, మనోహర్, మున్సిపల్ ఏఈ రవీంద్ర, రక్షీత నీటి సరఫరా ఏఈ శ్రీకాంత్ సాగర్ నీటి సరఫరా కాంట్రాక్టర్ జి శ్రీనివాస్,కల్లం వెంకట సుబ్బారెడ్డి కొత్తపులి బ్రహ్మ రెడ్డి మరియు మున్సిపల్ , రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు