తహశీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండల తహశీల్దార్ గా అశోక్ కుమార్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నాగులుప్పలపాడు మండలం నుండి ఇక్కడకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పొదిలి తహశీల్దారు గా పనిచేసిన భాగ్యలక్ష్మి మార్కాపురం కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.

ఈ సందర్భగా నూతన తహశీల్దారు అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన ఆన్నారు.

అనంతరం మండల రెవెన్యూ సిబ్బంది తహశీల్దారు ను ఘనంగా సత్కరించారు