మానసిక వికాసం సమగ్ర అభివృద్ధి అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం – సిడిపిఓ సుధ మారుతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
మానసిక వికాసం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని పొదిలి ప్రాజెక్టు సిడిపిఓ సుధ మారుతి అన్నారు.
మంగళవారం నాడు స్థానిక కంభాలపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నందు జన భాగస్వామ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పొదిలి సిడిపిఓ పి సుధా మారుతి మాట్లాడుతూ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క మానసిక వికాసం సమగ్ర అభివృద్ధి సంపూర్ణమైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల పని చేస్తున్నాయని ఈ యొక్క అవకాశాన్ని గ్రామంలోని ప్రతి ఒక్క తల్లులు వారి యొక్క పిల్లలను పూర్వ ప్రాథమిక విద్య కొరకు అంగన్వాడీ కేంద్రాలను చేర్పించాలని తల్లులకు మరియు గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ పూర్వ ప్రాథమిక విద్య కొరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉన్నతమైన కృషిని ప్రీస్కూల్ యాక్టివిటీ బుక్స్ అండ్ ప్రీస్కూల్ కిట్టు ఆటపాటలు వస్తువులు ఇవన్నీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని అలాగే ప్రతి ఒక్క గర్భవతులు బాలింతలు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించుకోవాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి స్కూల్లో పిపిఒస్ పూర్తిచేసుకుని ఒకటో తరగతిలోకి ఎంపీపీ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు కూడా సర్టిఫికెట్లు అందజేసి వివిధ రకాలైన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సుభాషిని ,సరిత ,ఝాన్సీ రాణి ,లక్ష్మీ ప్రసన్న , ప్రథమ కోఆర్డినేటర్ ఎస్ వెంకట్ రావు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు