కంది,కొర్ర చిరు సంచులు పంపిణీ చేసిన శాసనసభ్యులు కుందూరు

ఉచిత కంది కొర్ర చిరు సంచులను మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేసారు.

శనివారం నాడు స్థానిక పొదిలి 3వ రైతు భరోసా కేంద్రం నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలన్నారు, రైతు భరోసా కేంద్రం పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద వస్తువులను ఇవ్వడం జరిగింది ఈ వస్తువులను రైతులందరూ అద్దె ప్రాతిపదికన వినియోగించుకోవాలని తెలియజేశారు. కౌలుకి సాగు చేసుకునే రైతులందరూ కూడా తప్పనిసరిగా పంట ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని తెలియజేశారు. వేసవికాలంలో రైతులందరూ తప్పనిసరిగా మట్టి పరీక్షలు చేయించుకోవాలన్నారు. దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీ బాలాజీ నాయక్ గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా కంది మినీ కిట్స్ ఉచితంగా ఇస్తారని తెలియజేశారు. దీనికిగాను ప్రతి రైతు భరోసా కేంద్రం లో రైతు రిజిస్ట్రేషన్ చేయించుకొని విత్తనాలను తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో ఎరువులను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతామని తెలియచేశారు.

మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులబ్దిన్ మాట్లాడుతూ కొర్ర విత్తనాలను కూడా రైతులకు అందజేస్తామని తెలియజేశారు. మరియు గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వరి విత్తనాలను ఇస్తున్నామని ,పీఎం కిసాన్ నందు ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో దరిశి సహాయ వ్యవసాయ సంచాలకులు బాలాజీ నాయక్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, హనీమూన్ శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపిపి నరసింహారావు, చెంచిరెడ్డి, చెన్నారెడ్డి, మరియు అన్ని రైతు భరోసా కేంద్రాల పరిధిలోని రైతులు, సర్పంచులు, మండల వైసీపీ నాయకులు, మండలంలోని గ్రామ వ్యవసాయ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.