సాగర్ నీటి సరఫరా కోసం ధర్నా

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి మండలం ఆముదాలపల్లి గ్రామ నందు గత 6 నెలలు సాగర్ నీటి సరఫరా లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంగళవారం నాడు స్థానిక గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులు ఖాళీ బిందెలు తో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ఎంఎల్ఏ హామీ ఇచ్చిన సాగర్ నీటి సరఫరా జరగలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని
ప్రభుత్వాని హెచ్చరించారు.

ఈ ఆందోళన కార్యక్రమాలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు