సురక్ష గ్యాస్ పైప్ వాడిన వారికే ప్రమాద బీమా వర్తింపు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్యాస్ వినియోగదారుల రక్షణ నిమిత్తం ప్రమాద బీమా లో భాగంగా ప్రమాదం జరిగినప్పుడు నిర్దేశిత కాలపరిమితి కలిగిన సురక్ష పైప్స్ ని ఉపయోగించిన వినియోగదారులకు మాత్రమే కవరేజ్ ఉంటుందని అట్టి పైప్స్ ను సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డేటాబేస్ లో కూడా అప్డేట్ చేసుకొని ఉండాలని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీ ధృవీకరించిన సురక్ష పైప్ మరియు రెగ్యులేటర్ వాడిన వారికి మాత్రమే ప్రమాద బీమా వర్తిస్తుందని అది కాకుండా వేరే ఎటువంటి పైప్ ను కానీ, రెగ్యులేటర్ కానీ వాడినా, అదేవిధంగా కాలపరిమితి ముగిసిన పైప్ ని వాడినా, ప్రమాదం సంభవించినప్పుడు ప్రమాద బీమా వర్తించదని పొదిలి కరుణా ఇండెన్ గ్యాస్ ఏజెన్సీ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
కావున గ్యాస్ వినియోగదారులు ఒకటికి రెండుసార్లు తాము వాడుతున్న పైప్స్ మరియు రెగ్యులేటర్ ను తనిఖీ చేసుకుని, ఒకవేళ పైప్ లేదా రెగ్యులేటర్ మార్చాల్సిన అవసరం ఉందని భావిస్తే, మీ గ్యాస్ డెలివరీ బాయ్ ని కానీ గ్యాస్ ఆఫీసును కానీ సంప్రదించగలరని ఒక ప్రకటన విడుదల చేశారు