ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి

శనివారం నాడు ఒక ప్రైవేటు కార్యాలయం నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అఖిలేష్ యాదవ్ బర్త్ డే కేక్ ను సర్పంచ్ చిరుమళ్ళ శ్రీనివాస్ యాదవ్ కోసి అభిమానులకు పంచి పెట్టారు

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పొల్లా నరసింహారావు, మూరబోయిన బాబురావు యాదవ్, నియోజకవర్గం అధ్యక్షులు యేటి ఏడుకొండలు, మండల అధ్యక్షులు వీర్ల శ్రీనివాస్ యాదవ్, యాదవ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు, చాగంటి వెంకటేశ్వర్లు,శివరాత్రి శ్రీనివాస్ యాదవ్,మందగిరి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు