విజయవాడ- బెంగలూరు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పొదిలి మండలం ఉప్పలపాడు వద్ద త్వరలో నిర్మించనున్న విజయవాడ టు బెంగుళూరు ఎక్స్ ప్రెస్ హైవే లో భూములు కొల్పొతున్న రైతులతో ప్రకాశంజిల్లా జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసరావు మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులు ఎవ్వరు నష్టపొనవసరం లేదని భూమి కోల్పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర ప్రకారం భూముల విలువ మేరకు నష్టపరిహారం అందిస్తామని తెలియజేసారు. ఎక్స్ ప్రెస్ హైవే కు భూసేకరణ పూర్తి అయినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రైతులు నష్టపరిహారం పెంచాలని ఎకరాకు 9న్నర లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని ప్రైవేటు మార్కెట్ లో ఎకరా 50 లక్షల నుంచి 80 లక్షలు దాకా పలుకుతుందని రైతులమీద పెద్దమనస్సుతో కనీసం ఎకరాకు 25 లక్షలైన నష్టపరిహారం అందించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అజయ్ కుమార్, తహశీల్దార్ అశోక్ రెడ్డి, ఇన్చార్జి ఆర్.ఐ కిలారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.