ఆమంచి కి మద్దతుగా భారిగా తరలివెళ్లిన జనసైనుకులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతున్న నేపధ్యంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో మార్కాపురం, దరిశి నియోజకవర్గల నుంచి భారిగా జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా వరికూటి నాగరాజు మాట్లాడుతూ తొలి విడత, రెండో విడత వారాహి యాత్ర లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రజా స్పందన చూస్తుంటే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటంతో ఖయ్యామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు