రామాయణకండ్రిక లో గడప గడపకు మన ప్రభుత్వం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

రామాయణకండ్రిక గ్రామం నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మాజీ సర్పంచ్ పెమ్మని ఓంకర్ యాదవ్, కామునూరి వెంకట్రావు ఆధ్వర్యంలో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

మండలంలో ఊహించని విధంగా రామాయణకండ్రిక గ్రామం మహిళలు హారతులు తో ఘన స్వాగతం పలికారు

స్థానికంగా ఉన్న పలు సమస్యలను శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి దృష్టికి తీసుకొని రాగా శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి,వైసిపి నాయకులు సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, హనీమూన్ శ్రీనివాసులు రెడ్డి, షేక్ నూర్జహాన్, చెన్నారెడ్డి,పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ , మాజీ ఎంపీపీ నరసింహారావు, పిచ్చి రెడ్డి తదితరులు పాల్గొన్నారు